బోయిన్ పల్లి మార్చి 10 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ రెండో వార్డు రసూల్ పుర లో మంగళవారం రక్షణ సమితి జ్యోతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం టి ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ తప్పకుండా ఉంటుందని, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి కేవలం మహిళలకే ఉంటుందని, మగవాడి విజయం వెనక మహిళల పాత్ర ఎంతో ఉందని, కేవలం మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళలనుగౌరవించుకోవాలని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందడానికి వ్యక్తిగతంగా తాను కూడా సహాయ సహకారాలు అందిస్తానని టి ఎన్ శ్రీనివాస్ చెప్పారు.ఈ కార్యక్రమంలో నర్సింహ, గణేష్,శివ యాదవ్, ప్రవీణ్ తో.పాటు తదితరులు పాల్గొన్నారు.

