హైదరాబాద్ మార్చి 12
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకొని గురువారం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఎం డీ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి, చీఫ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎ. భవానీల ఆధ్వర్యంలో డయాలసిస్ రోగులతో కలిసి కేక్ కట్ చేసి కిడ్నీ
ఆరోగ్యంకోసం ఆరోగ్యవంతమైన జీవనశైలి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటించాలని, మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాదుల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ నేఫ్రాలజిస్టులు డాక్టర్ అనురాధ, డాక్టర్ రాజేష్, డాక్టర్ కౌశిక్ లు కిడ్నీ ఆరోగ్యం, ప్రాముఖ్యత, కిడ్నీ సంబంధ వ్యాధులను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కిడ్నీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలపై డైటీషియన్ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ పొందుతున్న రోగులతో పరస్పర అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


