తప్పుడుగా ఓట్లు నమోదు చేసినట్లు తేలితే చర్యలు తప్పవు- డివిజన్ రెవెన్యూ అధికారి & ఈఆర్వో

కొర్రపాటివారిపాలెం గ్రామంలోని 255 వ పోలింగ్ బూత్ నందు ఓట్ల నమోదులో తప్పులు జరిగినట్లు విచారణలో తేలితే చర్యలు తప్పవని అద్దంకి ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాన్సన్ ఆగ్రామ బిఎల్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్బంగా కొర్రపాటివారి పాలెం సర్పంచ్ శ్రీదేవి రామయ్య, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, కన్నయ్య, మాజీ సర్పంచ్ కె.నరసింహారావులు
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కలిసి ఓట్ల నమోదులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. గ్రామ బియల్వో వైసీపీ నాయకులతో కుమ్మకై గ్రామంలోనివాసం లేకుండా హైదరాబాద్, బెంగులూరు గ్రామాల్లో నివాస ముంటూ, ఓటు హక్కు పొందే వయస్సు 18 ఏళ్లు లేకుండా ధరఖాస్తు పెట్టుకున్న వారికి దాదాపు 25 మందిఓట్లు నమోదు చేశారన్నారు. దరఖాస్తు పెట్టుకున్న వారు.
ముంటూ, ఓటు హక్కు పొందే వయస్సు 18 ఏళ్లు లేకుండా ధరఖాస్తు పెట్టుకున్న వారికి దాదాపు 25 మంది ఓట్లు నమోదు చేశారన్నారు. ధరఖాస్తు పెట్టుకున్న వారు స్థానికంగా ఆధార్ కార్డ్
అడ్రస్, నివాసంలేక పోయినా గ్రామంలో ఎలాంటి విచారణ చేయకుండానే ఏకపక్షంగా ఓటు ఇవ్వటం జరిగిందన్నారు. ఎన్నికల నియమా వలి ప్రకారం గ్రామంలో విచారణ జరిపి ఓటుకు ధరఖాస్తు పెట్టుకున్న వ్యక్తిని సంప్రదించి సంతకం తీసుకోకుండా ఓటు ఇవ్వటం జరిగిందన్నారు. ఈవిషయమై
తాము స్థానిక తహసీల్దారు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.దీంతో ఈఆర్వో జాన్సన్ సదరు బియల్ ఓ పిలిపించి ప్రశ్నించారు. పట్టించుకోలేదన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఓట్లు నమోదు చేయాలని, ఫిర్యాదుదారులు చెప్పినట్లుగా తక్కువ వయస్సువున్న వారికి, ఇతర ప్రాంతాల్లో నివాసం వున్న వారికి ఏఆధారం లేకుండా ఓటు నమోదయినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. ఓటర్లు పెట్టు కున్న దరఖాస్తులు , ఆధారాలు తన ముందు వుంచాలన్నారు. 255 బూత్లో ఫిర్యాదు చేసిన ఓట్ల నమోదుపై పూర్తి స్థాయి విచారణ జరిపి తప్పు లేలితే శాఖా పర చర్యలు తీసుకో వటం జరుగుతుందని హెచ్చరించారు.
దీనిపై విచారణ జరిపిం చితప్పుగా ఓట్లు నమెదయితే తొలగిస్తామని ఫిర్యాధు దారులకు ఈఆర్వో జాన్సన్ హామీ ఇచ్చారు.ఈ విషయమై కొర్రపాటివారిపాలెం టీడీపీ నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లజనార్ధన్ ద్వారా జిల్లాకలెక్టర్ రాజాబాబుకు సోమవారం ఫిర్యాదు చేశారు.
పలు రికార్డులను పరిశీలించిన ఆర్ డీఓ జాన్సన్….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను అద్దంకి ఆర్ డీఓ జాన్సన్ సోమవారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న రెవిన్యూ రికార్డుల వివరాలను పరిశీలించారు. ఎప్పకప్పుడు పెండింగ్ లేకుండా పనులు చెయ్యాలని విఆర్లకు సూచించారు. బిఎల్ఎలు కూడ క్లయింల విషయంలో స్పష్టంగా ఉండాలని కోరారు. తహసీల్దార్ రమణా రావు సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *