ఇంటిపన్నులను బాధ్యతగా చెల్లించి అభివృద్ధికి సహకరించాలి…డిల్డీవో సువార్త

ఇంటియజమానులు ప్రతి సంవత్సరం బాధ్యతగా ఇంటిపన్పులు చెల్లించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని అద్దంకి డియల్డీవో సువార్త తెలిపారు. “లక్కవరం పంచాయతీ లో జరుగుతున్న ఇంటి పన్నుల వసూళ్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ఇంటి పన్నులు చెల్లింపులపై అవగా హన కల్గించారు. ఇంటి పన్నులు చెల్లించక పోతే నిధులు సమకూరక గ్రామ పం చాయతీల అభివృద్ధికుంటు పడుతుందన్నారు. ఇంటిపన్నులు ఎప్పటి కప్పుడు చెలిస్తే ఆదాయ వనరులు పంచాయతీలకు సమకూరి గ్రామాల్లో అభివృద్ధి పనులు” చేసుకునే వెసులు బాటు వుంటుందన్నారు. స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది కూడా ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈనెలాఖరు లోపు నూరుశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలన్నారు. గ్రామంలో డిఎల్డీవో తిరిగి ఇంటి పన్నుల గురించి అవగాహన కల్గించారు.
డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మారాబత్తుల సుజాత, పంచాయతీ కార్యదర్శి డి.నాగమల్లేశ్వరి, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తూర్పుగంగవరం స్వర్ణ గ్రామ కార్యాలయం లోని ఆధార్ కేంద్రం పరిశీలన …
తూర్పుగంగవరం స్వర్ణ గ్రామ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని
డిఎల్డీవో పరిశీలించారు. స్వర్ణ గ్రామకార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించా రు. ఆధార్ తప్పులను సరిచేసి మరళా పొరపాట్లు జరుగకుండా చూడాలన్నారు. ఆధార్ సెంటర్ నందు ఆధార్ తీయించుకునే వారు పూర్తి వివరాలను తీసుక వచ్చి ఆధార్ నమోదు చేయించు కోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఆమె వెంట డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మారాబత్తుల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *