శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాలలో వాడ వాడలా ఘనంగా నిర్వహించారు. చలువు పందిళ్లు వేసారు, పానకం, వడ పప్పు లు పంచి పెట్టారు. శ్రీరామ నవమి శు కాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు వారికి ఆదర్శ దేవుడు అయిన రాముని కళ్యాణంను తాళ్లూరు, నుంకి రెడ్డి పాలెం, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు, వెలుగు వారి పాలెం, నాగంబొట్ల పాలెం, రెడ్డి సాగర్, అయ్యల వారి పాలెం, రామభద్రాపురం, లక్కవరం, దోసకాయల పాడు, తోట వెంగన్న పాలెం, దారం వారి పాలెం, మాధవరం, కొత్త పాలెం, తురకపాలెం, మన్నేపల్లి, రమణాల వారి పాలెం, విఠలాపురం, చంద్రగిరి, రజానగరం, మల్కాపురం, కొర్రపాటి వారిపాలెం, శివరామపురం, గంగ పాలెం తదితర గ్రామాలలో ఉభయ దాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయ దాతలకు పీటలపై కూర్చిని కళ్యాణం నిర్వహించారు. దేవాలయాల వద్ద ప్రత్యేక పూజల అనంతరం పానకం, వడ పప్పు ప్రసాదాలు భక్తులకు పంచి పెట్టారు. అన్నదానం నిర్వహించారు.
