హైదరాబాద్ మార్చి 28
(జే ఎస్ డి ఎం న్యూస్) :
గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, తంబాకు, మద్యం వంటి వ్యసన పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం కాచిగూడ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్రమంత్రి నోటి క్యాన్సర్ పై అవగాహన మారటానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మీ మార్ధాన్ను హైదరాబాద్ స్మైల్ ఆధ్వర్యంలో డాక్టర్ దిలీప్ కుమార్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా యువత ఆరోగ్యపరంగా తీవ్రమైన ప్రమాదాలకు గురవుతూ, తమ భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దేశానికి యువతే శక్తి మూలాధారమని పేర్కొంటూ, అలాంటి యువశక్తి ఎటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
యువతలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం అత్యవసరమని, ఇందుకు మారథాన్‌ల వంటి ప్రజా అవగాహన కార్యక్రమాలు సమర్థవంతమైన వేదికలని ఆయనతెలిపారు.హైటెక్ సిటీ లోని టీ వర్క్స్ సమీపంలో 10 కిలోమీటర్ల మేర ఈ మారథాన్ నిర్వహించబడనుంది. నగరంలోని డెంటల్ మరియు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 10 వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు.ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కార్యక్రమంలో తెలంగాణ మాజీ బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, డా. చంద్రకాంత్, డా. సంతోష్, డా. శరాస్, డా. నాగదీపిక, నాగ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
