హైదరాబాద్ ఏప్రిల్ 5
(జె ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లాలాపేటలోని కీర్తి టవర్స్ అపార్ట్మెంట్ శాంతి ఎంక్లేవ్ లో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్‌లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.ఎం.డి.సి లిమిటెడ్, సి ఎస్ ఆర్ చొరవ తో ఓపెన్ జిమ్ ల ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. జీవనశైలికి అనుగుణంగా ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఖాళీ ప్రాంతాలు, పార్కులో కార్పొరేట్ సంస్థల సహకారంతో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి మాట్లాడుతూ అపార్ట్మెంట్ నివాసితుల ఆరోగ్యం, శ్రేయస్సుకుప్రాధాన్యతనిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు.తెలియజేశారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అంతటా జిమ్‌లను ప్రారంభించాలన్న ఆయన చొరవ నిజంగా ప్రశంసనీయం. ఇది స్థానిక ప్రజల ఫిట్నెస్ మరియు జీవనశైలికి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, సికింద్రాబాద్, తార్నాక, లాలాపేట బిజెపి నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.



