మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం సిబ్బందితో ప్రాజెక్టు డైరెక్టర్ పీడీ జోషఫ్
కుమార్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై పనులు జరుగుతున్న తీరు, పని కల్పిస్తున్న వివరాలపై సమీక్షించారు. మేట్లతో మస్టర్లు వేయించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు వేయవద్దని చెప్పారు. ఇచ్చిన లక్ష్యాల మేరకు పనులను చేయించాలని, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కోరారు. జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజా వేదిక కార్యక్రమం మొదటి నిర్వహిస్తారని ఎపీఓ వెంకటేశ్వర్లు ప్రకటించినప్పటికి రెండు మండలాలలో ఒకే రోజు నిర్వహించటానికి వీలు లేక పోవటంతో తాళ్లూరు మండలంలో ప్రజా వేదిక బుధవారానికి వాయిదా వేసారు. ఎంపీడీఓ అజిత, ఎపీఓ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
