ఒంగోలు-2 వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి విశ్వశ్రీ గురువారం పరిశీలించారు. పశ్చిమాసియా ఉద్రిక్తల వలన మార్కేట్ కొంత అనిశ్చితి నెలకొని ఉన్నదని బోర్డు ఈడీ అన్నారు. ఎక్కువ ట్రైడ్ పొగాకు ఉత్తిత్తి అయినందున మంచి ధర లభిస్తుందని చెప్పారు. కర్ణాటకలో అమ్మకాలు ముగింపు దశకు రానందున కొన్ని రోజులు వరకు ఇక్కడ రోజు మార్చి రోజు అమ్మకాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మెనేజర్ రామాంజనేయులు, వేలం నిర్వాహణాధికారి జె తులసి తదితరులు పాల్గొన్నారు.

