అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వల్లారపు.

బౌద్ధ నగర్ ఏప్రిల్ 14 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత రాజ్యాంగ నిర్మాత డా॥బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బౌద్ధనగర్ పార్క్ వద్ద సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లపు శ్రీనివాస్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాలబూత్ రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వల్లారపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పేద, బడుగు, బలహీనవర్గాల శ్రెయస్సు కోసం, సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంది నారాయణ, కంది శైలజ,తెదేపా బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు వెంకటస్వామి, బెలిదే రవి, నందు, సచిన్, చందర్ ముదిరాజ్, శ్రీనుయాదవ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *