బేగంపేట ఏప్రిల్ 14 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
స్వేచ్ఛ ,సమానత్వం, సమన్యాయం వంటి మూల సూత్రాలను దేశానికి అందించిన గొప్ప మానవతా వాది డా.బి.ఆర్.అంబేద్కర్ అని కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పొన్నబోయిన సురేష్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం ప్రకాశం నగర్ డివిజన్ పరిధిలో మాల కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో సురేష్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో నాయకులు అమరం శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ నాయిలతో కల్సి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో సమన్యాయం కోసం పోరాడిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అన్నారు. నేటి యువత రాజకీయ నాయకులు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగి ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సురేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


