ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో శ్రీహర్షిణి కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మరోసారి విజయపరంపరను కొనసాగించారు. జూనియర్ తమ ఇంటర్ యం.పి.సి విభాగం నందు అలవల వసంతలక్ష్మి 470 మార్కులకు గాను 467 మార్కులతో ప్రకాశం జిల్లాలో ప్రథమస్థానం కైవసం చేసుకున్నారు. ఐనవోలు అనూష, కల్లె వైష్ణవి, చాగంటి రమ్య, జడ దివ్య అరుణలు 466 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పొందారు. జూనియర్ బై.పి.సి విభాగం నందు రాయి వసుధ 455 మార్కులకు గాను 447 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచారు. బండి హరిణి 444 మార్కులు, అన్నంగి పైసి, రేవు వాసవ్య పల్లవి, షేక్ షబూర్ లు 443 మార్కులు సాధించి ద్వితీయ మరియు తృతీయ స్థానంలో నిలిచారు. జూనియర్ సి.ఇ.సి విభాగం నందు షేక్ మదిని 500 మార్కులకు గాను 491 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. గుండాబత్తిని చరణ్ 482 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. సీనియర్ యం.పి.సి విభాగం నందు బత్తుల ధరణి 1000 మార్కులకు గాను 991 మార్కులతో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. యం. వెంకట జ్యోత్స్న, డి. అర్చిత, జి. లక్ష్మీ శైలజ, పి. హృదయబాబులు 989 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, పి. తన్విత, కె. వెంకట కిషోర్లు 988 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. సీనియర్
బై.పి.సి విభాగం నందు జి. ఉజ్వల హర్షిణి 1000 మార్కులకు గాను 980 మార్కులతో ప్రకాశంజిల్లాలో ప్రథమ స్థానాన్ని, కె. నారాయణ స్వామి 978 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. జూనియర్ ఇంటర్ నందు 460 మార్కులకు పైగా 48 మంది, 450 మార్కులకు పైగా 128 మంది, 400 మార్కులకు పైగా 429 మంది. సీనియర్ ఇంటర్ నందు 980 మార్కులకు పైగా 50 మంది, 950 మార్కులకు పైగా 150 మంది, 900 మార్కులకు పైగా 288 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డైరెక్టర్ గోరంట్ల హర్షిత్, డీన్ దాది ఆంజనేయులు, అకడమిక్ డీన్ కరణం నారాయణ, ప్రిన్సిపల్స్ దివి రమేష్, యం. ఏడుకొండలు మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని విజయాన్ని సాధించిన విద్యార్థినీ, ఇంతటి విద్యార్థులందరికీ మిఠాయిలు అభినందనలు తెలియచేశారు.


