బేగంపేట ఏప్రిల్ 22
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సమాజంలో ప్రతి రోజు వీధులను శుభ్రం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులే నిజమైన దేవుళ్ళని బి జె పి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురువా రెడ్డి అన్నారు.డా. బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా బిజెపి పార్టీ అధిష్టానం , వారము రోజుల పాటు సమాజములో పరిశుభ్రతను కాపాడే ప్రథమశ్రేణి కార్మికులను సన్మానించాలని ,సూచించడంతో బేగంపేట్ మోతీలాల్ నెహ్రూ నగర్ పార్క్ లో పలువురు జి హెచ్ ఎం సి కార్మికులను బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురువా రెడ్డి సన్మానించి, వారికి కానుకలను అందజేసారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ బిజెపి డివిజన్ అధ్యక్షులు యం. మహేష్ కుమార్ ముదిరాజ్ , మహిళ మోర్చా నాయకురాలు సంధ్య లక్ష్మీ , డివిజన్ ప్రధాన కార్యదర్శి బాబురావు ఇతర బిజెపి నాయకులు టి. వెంకటేశ్ యాదవ్, ఆర్.సంతోష్ ,ప్రమోద్, లోహిత్ తదితరులు పాల్గొన్నారు.


