ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రొత్సహించాలని బొద్దికూరపాడు ప్రాధమిక పాఠశాల (జనరల్) ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యమాచారి కోరారు.
బొద్దికూరపాడులో బుధవారం ఇంటింటికి తిరిగి కర పత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అన్ని సౌకర్యాలను వివరించారు. విద్యార్థుల అల్ రౌండ్ డవలప్ మెంటు కు ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న కృషిని తెలిపారు. ఉపాధ్యాయులు హరిత, రేవతి, విజయకుమారి, శర్మ, అంగన్ వాడీ టీచర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
