చిన్నారులకు చిన నాటి నుండే సెల్ ఫోన్లను అలవాటు చేసి వారి కంటి చూపు తగ్గ
టానికి కారణం కావద్దని తల్లిదండ్రులను ఐసి డీఎస్ దర్శి ప్రాజెక్టు సీడీపీఓ ఆర్ పరిమళ కోరారు. తాళ్లూరులో బుధవారం అంగన్ వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో బాగంగా “అంగన్ వాడీ కోసం సమాజ మద్దతు” అనే అంశంపై తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ మాట్లాడుతూ తల్లి, శిశు పోషణ పై అవగాహన కల్పించారు. రెండు సంవత్సరాల లోపు చిన్నారులకు మొదడు అభివృద్ధికి ప్రేరణ, ఆట ఆధారిత విద్య తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో వారి పాత్రపై అవగాహన కల్పించారు. లోకల్ గా దొరికే లో కాస్ట్ నో కాస్ట్ ఫుడ్ను వాడాలని, జింక్ ఫుడ్ చిన్నారులను దూరం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ సునీత, సెక్టార్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
