తాళ్లూరు మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 4.44 కోట్లతో పంచాయితీ రాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు రోడ్లను క్వాలిటీ కంట్రోల్ డీఈ శివ ప్రసాద్ బృందం పరిశీలించారు. మాధవరం, శివ రామ పురం, తోట వెంగన్న పాలెం, లక్కవరం లలో పూర్తి చేసిన రోడ్లను పరిశీలించి పలు చోట్ల మెటీరియల్ ను తవ్వి శాంపిల్స్ తీసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మాధవరం టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు సోము శ్రీనివాస రావు, గొల్లపూడి వేణు బాబు, హను మంత రావు, పీ ఆర్ ఎఈ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

