నకిలీ వెండితో దుకాణదారు కి బురిడీ…అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు.

మహంకాళి,ఏప్రిల్ 25,
(జే ఎస్ డి ఎం న్యూస్):
వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెండి కడ్డీలతో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను మహంకాళి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ డి సి పి రక్షితమూర్తి అడిషనల్ డీసీపీ నరసయ్య ,మహంకాళి ఏసీపీ శ్రీధర్ లతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా నుంచి సుమారు 8.4 కిలోల స్వచ్ఛమైన వెండి, రూ. 1.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.మహంకాళి స్ట్రీట్‌లో సిల్వర్ రిఫైనరీ నిర్వహిస్తున్న హీరాలాల్ వర్మను నమ్మించిన నిందితులు, గత నెలలో 10 కిలోల బరువున్న మూడు వెండి కడ్డీలను తెచ్చారు. వాటికి నకిలీ ప్యూరిటీ సర్టిఫికేట్లు జతచేసి, 60 శాతం స్వచ్ఛత ఉందని
నమ్మబలికారు. గతంలో జరిగిన లావాదేవీల కారణంగా వారిని నమ్మిన బాధితుడు, ఆ మెటీరియల్‌కు బదులుగా రూ. 15 లక్షల విలువైన 6.35 కిలోల స్వచ్ఛమైన వెండిని వారికి అప్పగించాడు.
నిందితులు వెళ్ళిన తర్వాత సదరు కడ్డీలను పరీక్షించగా, అందులో అసలు వెండి లేదని (0% ప్యూరిటీ) అని తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడన్నారు.
ఈ ముఠా తొలుత వ్యాపారుల నమ్మకాన్ని పొందేందుకు ఒకటి రెండు సార్లు నిజమైన వెండిని ఇచ్చి, మూడోసారి నకిలీ కడ్డీలతో మోసానికి పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ హృదయేష్ కుమార్‌తో పాటు సుశీల్ కుమార్, ప్రిన్స్, రాజీవ్ జైన్, సోను కుష్వాహాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ముఠా మహంకాళి, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 12.5 కిలోల వెండిని కూడా కాజేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ వీరు ఇటువంటి మోసాలకు పాల్పడినట్లు నేర చరిత్ర ఉంది. కేసును వేగంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్ రవికుమార్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి బృందాన్ని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *