డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆదర్శంగా నిలవాలి.ప్రభుత్వం అండగా ఉంటుందిమంచి లక్ష్యం, లక్షణాలతో ఎదగాలి.బాల బాలికలకు స్పోర్ట్స్ కిట్స్, ధ్రువపత్రాలు అందచేత.రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క).

హైదరాబాద్ ఏప్రిల్ 27 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బాల, బాలికలు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పిలుపు నిచ్చారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 27 నుండి మే 2 వరకు బాలల భద్రత మరియు రక్షణ, మత్తు పదార్థాలకు నో చెప్పండి. వారోత్సవాలను ప్రారంభించి బాల, బాలికలకు స్పోర్ట్స్ కిట్స్, ముఖ్యమైన ధ్రువపత్రాలను అందజేశారు.
సోమవారం ప్రజా భవన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఈగల్ ఫోర్స్, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలతో కలసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల, బాలికలు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని అలాగే బాల బాలికలు మానసిక ధైర్యంతో ముందుకు సాగుతూ మంచి లక్ష్యం తో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం మీకు అన్నివేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. బాల బాలికలు స్వతంత్ర జీవన దిశగా అడుగులు వేస్తున్న ఆఫ్టర్ కేర్ పిల్లలకు జనన ధ్రువపత్రాలు, ఆధార్ , ఆదాయ, నివాస , కుల, అనాధ, ఆరోగ్యశ్రీ, బ్యాంకు ఖాతా వంటి అత్యవసరమైన పత్రాలను మంత్రి ఈ సందర్భంగా అందజేశారు.
బాల బాలికల విద్యా, ఉపాధి, ప్రభుత్వ సేవలనుపొందడంతో ఈ ధ్రువపత్రాలు ఎంతో సహాయపడతాయని తద్వారా స్వయం ఆధారిత జీవితాన్ని నిర్మించుకునే దిశగా బలమైన అడుగులువేయగలుగుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 2150 ధ్రువ పత్రాలు దరఖాస్తులు అందగా వాటిలో 1050 వివిధ ధ్రువపత్రాలు అందించడం జరిగిందని అలాగే మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.ఎస్ సి పి ఆర్ చైర్పర్సన్ సీత
దయాకర్ రెడ్డి మాట్లాడుతూ బాల, బాలికలు డ్రగ్స్ కు దూరంగా ఉండి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలు తోటి వారికి వివరించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఒక మంచి లక్ష్యంతో చదువుకొని ఎదగాలని మానసికంగా బాల బాలికలు ధైర్యంగా ఉండాలని చెడుకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఆమె సూచించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ ప్రతిభ మీలో ఉన్నదని, మంచి లక్ష్యంతో ప్రభుత్వం మీకు కల్పిస్తున్న సదుపాయాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ, ఈగల్ ఫోర్స్ అలాగే పోలీస్ శాఖ మూడు బృందాల ఆధ్వర్యంలో వారం రోజులపాటు బాలల భద్రత మరియు రక్షణ, మత్తు పదార్థాలకు నో చెప్పండి అని వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరు డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. అన్ని జిల్లాల్లో కూడా స్పోర్ట్స్ కిట్స్ అలాగే పలు రకాల ధ్రువపత్రాలుఅందించనున్నట్లు ఆమె వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ దాదాపు 45 పైగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లలో గల పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్, బాల బాలికల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమైన ధ్రువపత్రాలు అందుకోవటం గొప్ప అదృష్టంగాభావించాలని ఆమె పిల్లలకు ఉద్బోధించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా తేదీ 27 నుండి మే 2 వరకు బాలల భద్రత మరియు రక్షణ మత్తు పదార్థాలకు నో చెప్పండి వారోత్సవాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని అవగాహన పొందాలని తోటి వారికి కూడా వివరించాలని తెలిపారు.
అలాగే బాల బాలికలు మానసికంగా ధైర్యంగా ఉండాలని, చదువుపై ఏకాగ్రత పెట్టి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని, ప్రభుత్వం అన్నివేళలా తమకు అండగా ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.అనంతరం ఈగల్ ఫోర్స్ పోలీస్ అధికారులు, వివిధ కమిటీ సభ్యులు పలు అంశాలపై వివరించారు.కార్యక్రమంలో భాగంగా నవజాత శిశువు సంరక్షణ పోస్టర్, బంధుత్వ దత్తత ప్రక్రియ కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి పి సి ఆర్ మెంబర్ బి. అపర్ణ, జి. సరిత, ఎం.చందన అలాగే కే.వందన, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ శైలజ, ఈగల్ ఫోర్స్ అడ్మిన్ పద్మజ, టెక్నికల్ వింగ్ ఎస్పి రఘువీర్, వివిధ విభాగాల అధికారులు, సిడిపివోలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *