విశాఖ పట్నం,ఏప్రిల్ 27,(జే ఎస్ డి ఎం న్యూస్) : వందేళ్ళ ఆంధ్రా యూనివర్సిటీ పండుగ ఒక చరిత్ర అని,
ప్రపంచంలో నెంబర్ 1టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మరో చరిత్ర అని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.ఈ సందర్భంగా సి ఎం మాట్లాడుతూ నేను ఎన్నో కార్యక్రమాలకు వెళ్లాను కానీ యూనివర్సిటీలో మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఆనందం ఆకాశాన్ని తాకుతోంది. విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు. రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను విశాఖ వచ్చాను. 100 ఏళ్ల ఏయూ పండుగ ఒక చరిత్ర. రేపు ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మరో చరిత్ర.
ఆర్థిక సంస్కరణలు వచ్చాక 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనం అని ఆయన అన్నారు.గూగుల్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసింది. 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం.విశాఖ విశ్వనగరం గ్లోబల్ సిటీ ఇది అన్ స్టాపబుల్. ఎవరూ ఆపలేరన్నారు.100 ఏళ్ల చరిత్ర ఒక బ్రాండ్. రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ సమావేశం ఏయూలో నిర్వహించాం అది ఏయూ ప్రత్యేకత.53 యూనివర్సిటీలో రాష్ట్రంలో ఉన్నాయి.అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్. స్వాతంత్ర్య పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజ్ విక్రమ దేవ్, గజపతి రాజవంశం, పిఠాపురం రాజవంశం, బొబ్బిలి రాజులు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. వారిని మనం స్మరించుకోవడం ధర్మం, బాధ్యత కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు మొదటి వీసీగా చేసి బలమైన పునాది వేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే… నేనూ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొన్నాను.2వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి అయ్యారు. ఈ రోజు మన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తండ్రి సర్వేపల్లి అభిమాని. ఈయనకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టారు . కేవలం చదువు చెప్పడమే కాదు తెలుగు వైభవానికి ఏయూ కృషి చేస్తోంది. విద్య, సాహిత్య రంగాల్లో ప్రముఖులను కళా ప్రపూర్ణ అవార్డుతో అభినందిస్తున్నారు
ఎంతోమంది నాయకులను తయారు చేసిన గడ్డ ఏయూ. రాజకీయ ఉద్దండులు ఇక్కడ నుంచి వచ్చారు. వెంకయ్య నాయుడు ఏయూ నుంచే వచ్చారు.ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ప్రపంచంలోని చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేస్తున్నారు.నాక్ ఏ ప్లస్ ప్లస్ సాధిస్తోంది. ఎన్ఐఆర్ఎఫ్ లో 41వ ర్యాంక్, పబ్లిక్ సెక్టార్ లో 5వ ర్యాంక్ లో ఉంది. యూనివర్సిటీలు నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్.వాటిని కాపాడుకోవాలి. అన్ని యూనివర్సిటీల్లో విద్యాశాఖామంత్రి, గవర్నర్ ప్రతిభ ఉన్నవారిని వీసీలుగా ఎంపిక చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నాను.రూ.64 కోట్ల విలువైన ప్రాజెక్టులను నేడు మనం
ప్రారంభించుకున్నాం. ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్ వర్స్స్ ల్యాబ్ నెట్వర్క్ సెంటర్ ప్రారంభించుకున్నాం. రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం. బాలురు, బాలికల హాస్టల్, కాన్వకేషన్ హాలు, వీసీ భవన్ కు శంకుస్థాపన చేసుకున్నాం
యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీతో ఎంఓయూలు చేసుకున్నాం.
• నాకు 76 ఏళ్లయినా.. నేను 26 ఏళ్ల వ్యక్తిగానే
ఆలోచిస్తాను. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం. హైటెక్ సిటీ కట్టాం. నాలెడ్జ్ ఎకానమీకీ దోహదం చేశాం. నేడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటం తీసుకొచ్చాం.అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగం లో పేర్కొన్నారు. ఈ వేడుకలలో ఉప రాష్ట్రపతి, గవర్నర్ ,మాజీ ఉపరాష్ట్రపతి,సచిన్ టెండూల్కర్ ,త్రివిక్రమ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.







