గోమాతను రాజ మాతగా ప్రకటించాలి.

సికింద్రాబాద్ ,ఏప్రిల్ 27,(జే ఎస్ డి ఎం న్యూస్) : గోమాతను రాజ మాతగా ప్రకటించాలని వాసవి గో గ్రాస స్వస్వత సహాయ నిధి ట్రస్ట్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోవు తల్లితో సమానమని, గోవును పూజించడం తల్లిని పూజించడమేనని అన్నారు.
గో మాతకు ప్రాధాన్యత నిస్తూ, పూజించడం వలన సమాజానికి కలిగే ప్రయోజనం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు. అందుకే గో మాతను రాజ మాతగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు వెల్లడించారు. గో సన్మాన దివస్ పేరిట వాసవి క్లబ్, సికింద్రాబాద్
ఆర్య వైశ్య క్లబ్, సికింద్రాబాద్
సికింద్రాబాద్ పట్టణ ఆర్య వైశ్య మహాసభ,
గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్,
వాసవి క్లబ్ కె జీ జీ ఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్
సోదర సంస్థలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు వివరించారు.
ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పోకాల నరేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి పోకాల రాజ నర్సింహారావు, కోశాధికారి రావికంటి రామ్ దేవ్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *