రైతులకు పంట నూర్పిళ్ల సమయంలో డీజిల్ ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయూధికారి ప్రసాద రావు కోరారు. మండలంలోని పలు పెట్రోలు బంకులను ఆయన సందర్శించారు. మొక్కజొన్న 5వేల ఏకరాలు, వరి మరో 600 ఎకరాల వరకు నూర్పిళ్ల దశలో ఉందని చెప్పారు. ఇంకా మరో15 రోజుల వరకు వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయని తెలిపారు. పనులకు ఆటకం లేకుండా తగిన విధంగా స్పందించాలని డీలర్లను కోరారు .
