ఇంధనం అందుబాటుతో ముమ్మరంగా కోతలు -వ్యవసాయాధికారి ప్రసాద రావు

జిల్లా కలెక్టర్ రాజా బాబు ఆదేశాలతో అధికారులు తీసుకున్న నిర్ణయాలతో ఇంధనం అందుబాటులోనికి రావటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. మండలంలో వరి, మొక్కజొన్న కోతలను ఆయన మంగళవారం పరిశీలించారు. మండలంలో 26 కోత మిషన్లు అందుబాటులో ఉన్నాయని రోజు 250 నుండి 300 ఎకరాలలో కోతలు సాగిస్తున్నాయని చెప్పారు. రోజుకు నాలుగు వేల లీటర్ల పై బడి డిజిల్ అవసరం అవుతుందని అన్నారు. ఉదయం ఏడు గంటల నుండి I రాత్రి ఏడు గంటల వరకు పని సాగుతుందని చెప్పారు. మండలంలోని ఇంధన డీలర్లు ముందుగా రైతులకు ప్రాధాన్యం ఇచ్చి పనులు సాగే విధంగా సహకరించాలని కోరారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *