తాళ్లూరు:
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఎబీసీ హైస్కూల్ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత పొంది, ఉత్తమ మార్కులు సాధించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె వెంకటేశ్వర రావు తెలిపారు. 70 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే అందరూ పాస్ అయి నూరుశాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు చెప్పారు. 70 మంది విద్యార్థులకు గాను 38 మంది విద్యార్థులు అనగా 54శాతం మంది 500 మార్కులు పైన, 16 మంది విద్యార్థులు 550 మార్కులు పైన సాధించినట్లు చెప్పారు. పాఠశాలలకు చెందిన కొడిమెళ్ల స్వాతి (580), కుమ్మిత వెంకట ప్రసన్న మమతా లక్ష్మి (579), గుణపాటి నవదీప్ రెడ్డి (577), కంచర్ల నాగ విఘ్నేష్ (577), బంటుపల్లి అఖిల్ వర్మ (576), జి వెంకట తేజస్వి (567), పాలెం తారకేశ్వర రెడ్డి (567), సుంకర భవ్య శ్రీ (567), ఏ అక్షర శ్రీ లహరి (561), కుమ్మిత ప్రసన్న రెడ్డి (561), మారిశెట్టి కార్తీక్ (560), చంద్రగిరి లక్ష్మి దీప్తి (558), ముంగమూరి మేఘన (557), గంగుల యశ్వంత్ (556), కె అభిలాష్ (556), వై నందిని (550), వెలుగొండ ప్రవీణ్ (546) మార్కులు లు సాధించి పాఠశాల స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ, వంటి ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబు, ఉపాధ్యాయులు అభినందించారు.
