తాళ్లూరు మండలంలో పదవ తరగతి పరీక్షలలో 629 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 558 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధంచి 89శాతం సాధించినట్లు మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య తెలిపారు. అందులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 237 మందికి గాను 181 మంది 76శాతం, ప్రవేట్ పాఠశాల విద్యార్థులు 392 మందికి గాను 377 మంది అనగా 96శాతం ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. ప్రవేట్ పాఠశాలల్లో గీతాంజలి పాఠశాలకు చెందిన జి అక్షయ (589), షేక్ తన్సీనా బేగం (589), గంగా హైన్కూల్ కి చెందిన డి కార్తీక్ (588), శ్రీ నరస్వతి హైస్కూల్ కి చెందిన కె నుగుణ హేలీ (585), శారద హైస్కూల్ కి చెందిన షేక్ ఆషాబి (583), ఎబీసీ హైస్కూల్ కి చెందిన స్వాతి(580) ఉత్తమ మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో జెడ్బీ హెచ్ఎస్ లక్కవరంకు చెందిన బి కార్తిక్ (673), జెడ్పీహెచ్ ఎస్ నాగంబొట్ల పాలెం కు చెందిన వి శ్రీ వల్లిక (567), బొద్దికూరపాడు యూ వి ఎన్ శ్రీ జ (551), తూర్పుగంగవరం జెడ్బీహెచ్ఎస్ షఫియా (553), కెజి బివి తాళ్లూరుకు చెందిన పి అమూల్య (546), వికే ప్రభుత్వ ఉ న్నత పాఠశాల కు చెందిన షేక్ మనీషా (517), శివరామపురం జెడ్పీహెచ్ఎఎస్ పాఠశాలకు చెందిన డి విష్ణు (499)లు సాధించి ఆయా పాఠశాలల్లో ప్రతిభ చాటారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన లక్కవరం బి కార్తిక్ కు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ-2 సుధాకర్, పాఠశాల హెచ్ఎం పి అనంత పద్మనాభ రావులు ఒంగోలు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను నన్మానించి. విద్యార్థికి స్వీటు తినిపించి అభినందించారు.
