పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రకాశం జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపడంపై జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ మార్గనిర్దేశం, ఆయా విభాగాధిపతుల పర్యవేక్షణ, అధికారుల ఉమ్మడి కృషితోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయని అధికార యంత్రాంగం వర్షం వ్యక్తం చేసింది.
వన్ ఆఫీసర్… వన్ ఇన్స్టిట్యూట్
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినప్పుడే విద్య, వైద్యం, త్రాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని రాజాబాబు స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే పరిపాలనలో ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు వచ్చేలా దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి అధికారి ఒక హాస్టల్ను సందర్శించి వాటిలోని పరిస్థితులను పరిశీలించి, విద్యార్థులు మెరుగైన సాధించేలా, ఆయా హాస్టళ్లలో ఏమైనా సమస్యలు ఉంటే సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని దిశ నిర్దేశం చేశారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో అధికారులు ఆయా హాస్టళ్లను సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారు.
పక్కాగా 100 రోజుల ప్రణాళిక
తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులలో భయాన్ని తొలగించేలా, మంచి మార్కులు సాధించేలా వందరోజుల పాటు అమలు చేసేలా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి పై శ్రద్ధ పెట్టి వారి ప్రతిభను మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు రోజు స్లిప్ టెస్టులు పెట్టి, విద్యార్థులకు వెంటనే మార్కులను అధికారులు తెలియజేశారు. బలహీనతలను అధిగమించేలా స్టడీ అవర్స్ నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లను కూడా అధికారులు దత్తత తీసుకునేలా ఆదేశాలు ఇచ్చారు. దీనితో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఆయా స్కూళ్లను నిరంతరం సందర్శించి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రణాళిక అమలవుతున్న తీరును పర్యవేక్షించారు. మొత్తం ప్రణాళిక అమలును ప్రతిరోజు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్ ఆరా తీశారు. ఫలితంగా వివిధ విభాగాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత స్థాయిలో మార్కులు సాధించారని ఉపాధ్యాయ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.
జిల్లా లోని ఎపి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలల విద్యార్థులు మొత్తం 375 మంది 10వ తరగతి పరీక్ష వ్రాయగా 348 మంది విద్యార్థులు పాసు కావడం జరిగింది. 93.98 శాతం ఉత్తర్ణత సాధించగా రాష్ట్ర స్థాయిలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలల విద్యార్థులకు సంబంధించి జిల్లా 2వ స్థానంలో నిలిచింది. కొండపి రెసిడెన్షియల్ స్కూల్ కు సంబందించిన విద్యార్థి లక్ష్మి ప్రణతి 587 మార్కులతో జిల్లాలో మొదటి స్థానం సాధించగా, అదే రెసిడెన్షియల్ కు సంబందించిన విద్యార్థి పౌర్ణమి 580 మార్కులతో రెండు స్థానం సాధించడం జరిగింది.
