అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని పలు అభివృద్ధి ప్రారంబోత్సవ ప్రారంబోత్సవ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. తురకపాలెంలో రూ.20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ఐటీసీ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. తురకపాలెం, తాళ్లూరులలో పింఛన్లను అందించారు. కొత్త పాలెంకు చెందిన వై నాగేశ్వర రావు డయాలసిన్ పేషేంట్ కావటంతో రూ.10వేల పెన్షన్ ను అందించారు. కొర్రపాటి వారి పాలెంలో లో మాజీ సర్పంచి రామయ్య కుమారుని వివాహానికి హాజరై నూతన వధూ వరులను దీవించారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, ఎంపీడీఓ అజిత, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఎఎంసీ చైర్మన్ డీ ఎన్ సుబ్బా రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మానం రమేష్ బాబు, నాటక అకాడమి డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, మాజీ సర్పంచి గురువా రెడ్డి, కైపు రామ కోటి రెడ్డి, సాగర్, కుమ్మిత సుబ్బా రెడ్డి, తిరుపతి రెడ్ది, సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.




