తాళ్లూరు
మండలంలోని మన్నేపల్లి పంచాయతీ లింగాలపాడు గ్రామంలో గురువారం అర్ధరాత్రి దుండగులు జీవాల దొడ్డిలోకి ప్రవేశించి 20పోట్టేళ్లను అపహరించిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెలితే ఆగ్రామానికి చెందిన కాళిమళ్ల వెంకట్రామయ్య పొటేళ్లు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు నెలల క్రితం 20పోట్టేళ్లు కొని పెంచుతున్నాడు. తూర్పుగంగవరం వేళ్లే ప్రధాన రహదారి మార్గంలో గల ఇంటి వెనుక జీవాల కోసం దొడ్డి వేశాడు. కట్టుదిట్టంగా చుట్టూ కంచెవేసి గేటు ఏర్పాటుచేసి తాళం కూడా ఏర్పాటు చేశారు. 20 పొట్టేళ్లను రోజు లాగా రాత్రి దొడ్డిలో వుంచి గేటుకు తాళం వేసి ఇంట్లో నిద్రిస్తున్నారు. దాదాపు 11.30 గంటల సమయంలో కూడా పొట్టేళ్ల దొడ్డిలోకి వెళ్లి వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత గుర్తు తెలియని దుండగులు గేటుకున్న తాళాన్ని పగుల గొట్టి జీవాలు అరవకుండా స్ప్రేయర్ చల్లి 20 పోట్టేళ్లను తాము తెచ్చుకున్న ప్రత్యేక వాహనంలో వాటిని అపహరించుక వెళ్లారు. ఉదయం వెంకట్రామయ్య దొడ్డి వద్దకు వెళ్లగా పోట్టేళ్ల కన్పించక పోవటంతో ఆందోళన చెంది వెదుకు లాడినా ఆనవాళ్లు దొరక లేదు. ఆపొట్టేళ్ల విలువ దాదాపు 3 లక్షలు వుంటుందని ఆవేదన చెందాడు . ఈవిషయమై తాళ్లూరు పోలీస్ స్టేషన్లో వెంకట్రామ్య ఫిర్యాదు చేశారు. గత ఆనవాళ్లు దొరక లేదు. ఆపొట్టేళ్ల విలువ దాదాపు 3 లక్షలు వుంటుందని విలపిం చాడు.ఈవిషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో వెంకట్రామ్య ఫిర్యాధు చేశారు.
గత ఏడాది క్రితం మండలంలోని పలు గ్రామాల్లో ఇదేవిధంగా గొర్రె, పొట్టేళ్లను అ పహ రించగా స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి నింధితులను అదుపులోకి తీసు కున్నా జీవాలదొంగతనాలు కట్టడి కాలేదు. పోలీసులు జీవాల దొంగల ముఠాపై దృ ష్టి సారించి దొంగలను గుర్తించి ఇటువంటి ఘటనలు జరుగకుండా చూడాలని జీవాల యజమానులు కోరుతున్నారు.
లింగాలపాడులో జీవాల దొడ్డిలో చోరీ 20 పోట్టేళ్ల అపహరణ- రూ . 3లక్షల నష్టం
01
May