దళిత బహుజన రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం బడి పిలుస్తోంది వాల్
పోస్టర్ ను ఆవిష్కరించారు. తాళ్లూరు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ-2 సుధాకర్ రావు, డిబిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు మెరుగైన విద్య, ఉచిత పుస్తకాలు, తల్లికి వందనం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులు చిన్నారులను బడి వయస్సులో బడికి పంపి పోత్సహించాలని కోరారు. విద్యా చైతన్య యాత్రలో బాగంగా రజానగరం యానాది సంఘం లో బడి మాని వేసిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. కౌల్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురు కులాలు ఉ పయోగించుకోవాలని కోరారు.

