ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాల్లోని వసతి గృహాల విద్యార్థులకు సురక్షితమైనతాగునీటిని అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ కోరారు.
స్థానిక అంబేద్కర్ భవన్లో రెండు జిల్లాలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల సమావేశంలో శనివారం
ఆయన మాట్లాడారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న తాగునీరు సురక్షితమైనదో కాదో తెలుసుకునేందుకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం గ్రామీణ నీటి సర ఫరా విభాగం నుంచి వసతి గృహాలకు ఫీల్డ్ టెస్టు కిట్ ను అందజేస్తున్న ట్లు చెప్పారు. సురక్షిత తాగునీటిని అందించటంలో వార్డెన్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ జిల్లా కన్సల్టెంట్ సుభాషిణి, ఎస్.శైలజ, సురేంద్ర నీటినాణ్యతను పరీక్షించే విధానంపై అవగాహన కల్పించారు.




