ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిప్పవద్దుసమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలను సంతృప్తి పరచాలి – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ హితవు

దర్శి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి వినతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ .. .. తక్షణం పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించాలని కోరారు. మన కూటమి ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్య మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చూపుతున్న చొరవ చూస్తున్నమని అన్నారు . అదే స్ఫూర్తితో అధికారులు కూడా మన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ప్రజలకు జవాబుదారీగా ప్రతి చిన్న సమస్యను పరిష్కరించే విధంగా పరిష్కారం జరగకపోతే ఎందుకు జరగడం లేదు కూడా ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. ముఖ్యంగా వేసవి సమీపిస్తున్న పరిస్థితుల్లో తాగునీటి ఎద్దడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామాలలో దర్శి పట్టణంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించాలని తాగునీటి సమస్య తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అవసరమైతే అత్యవసర నిధులు కింద జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడి తాగునీటి ఎద్దడికి అవసరమైన నిధులు మంజూరు చేయించడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని రెవెన్యూ అధికారులను కోరారు. పొలం పాస్ బుక్స్, సర్వేలు తదితర రెవెన్యూ సమస్యలపై నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ప్రజల నుండి వినతులు వస్తున్నాయన్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా లో వోల్టేజ్ సమస్య, కరెంటు కోత స్తంభాలు అవసరం, తీగలు వాలి ఉండడం తదితర సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. నేడు మూడో వార్డులోని ఎస్సీ కాలనీ పర్యటించినప్పుడు కూడా అనేకమంది లో వోల్టేజ్ సమస్య, కరెంటు స్తంభాల పై ఫిర్యాదులు చేశారన్నారు. తక్షణమే విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు పార్కుల ఆధునీకరణ, డ్రైనేజీలో చెత్త నిలువలు ఎప్పటికప్పుడు తొలగించడం మురికి కాలువల పై బ్లీచింగ్ క్లోరినేషన్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీది లైట్ల పట్ల కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పార్కు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు కుక్కలు, కోతులు తిరుగుతూ పాఠశాలలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదులు వస్తున్నాయని తక్షణమే సమస్యను పరిష్కరించాలని రెండు రోజుల్లో నేను కూడా పార్కులో వాకింగ్ కి వస్తానని ఆమె తెలిపారు. కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతులు సెలవుల్లో దృష్టి సారించాలని అంగన్వాడీలలో ఆయాలు పౌష్టికాహారం పంపిణీ తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు ఇలా అధికారులు సమిష్టిగా ప్రజల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి తిరిగి ఆ సమస్యలు రాకుండా వచ్చే ప్రజా దర్బారులో లోపు పరిష్కారం చూపాలని లేనట్లయితే ఎందుకు అవడం లేదు ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. మన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చేందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతివారం ప్రజాదర్బార్ జరుగుతుందని డాక్టర్ లక్ష్మీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు ప్రజా దర్బార్ వినియోగించుకొని చిన్న చిన్న సమస్యల కోసం కార్యాలయాలు చుట్టూ తిరగవద్దని అవసరమైతే నేరుగా నాకు కాల్ చేయవచ్చునని ఆమె తెలిపారు. ప్రజా దర్బార్ లో రెవెన్యూ, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బి, సాంఘిక సంక్షేమ శాఖ తదితర శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *