23న ఎస్పి రోడ్డు శ్రీ వీర హనుమాన్ దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ లక్ష పుష్పార్చన…పటిష్టమైన ఏర్పాట్లు ..ఈవో శ్రీనివాస శర్మ.

బేగంపేట, మే 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ ఎస్పి రోడ్డు లోని శ్రీ వీర హనుమాన్ దేవాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ ఉదయం 9 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణంతో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పార్చనలో పాల్గొనాలని ఆలయకార్యనిర్వాహణాధికారి శ్రీనివాస శర్మ
తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లక్ష పుష్పార్చన అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాల వితరణ ఉంటుందని ఈ ఓ తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *