రోడ్డు మధ్యలో ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న 40 సంవత్సరాలు చెట్టు తొలగింపు.40 ఏళ్ల చెట్టుకు మహాపరి నిర్వాణ లో పునరుజ్జీవం కల్పించాం.. తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసిపి జి. శంకరరాజు.

బేగంపేట, మే 19,(జే ఎస్ డి ఎం న్యూస్) : నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే శ్యామ్ లాల్ జంక్షన్ లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయంగా మారిన 40ఏళ్ల వయసు కలిగిన పెల్టో ఫోరం చెట్టును అక్కడి నుంచి తొలగించి ,శ్యాంలాల్ బిల్డింగ్ మహాపరి నిర్వాణలో పునరుజ్జీవం కల్పించామని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్రాజు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ చెట్టుతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయంకలుగుతుందంటూ స్థానికులు పలుమార్లు అధికారులు దృష్టికి
తీసుకెళ్లడం, ఇటీవల కాలంలో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరగడంతో మంగళవారం ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్రాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు శ్యాంలాల్ జంక్షన్ కు చేరుకొని జెసిబి సహాయంతో పెల్టో పోరం చెట్టును అక్కడి నుంచి తొలగించారు. ఆ చెట్టును వెంటనే మహాపరి నిర్వాణకు తరలించి అక్కడ పునర్జీవం కల్పించారు. సంబంధిత అధికారుల అనుమతులు పొందిన తరువాత చెట్టును జాగ్రత్తగా అక్కడ నుంచి తరలించారు. మహాపరి నిర్వాణలో నాటిన చెట్టు సంరక్షణనుపర్యవేక్షించనున్నట్లు శంకరరాజు తెలియజేశారు .చెట్టు తొలగింపుతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, ప్రయాణికుల భద్రత మెరుగుపడుతుందని ,హరిత వాతావరణం కూడా పరిరక్షించబడుతుందని, ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి .జానకి రాములు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసి, యు బి డి విభాగంతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుడు హాజీతోచర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *