బోయిన్ పల్లి మే 20,
(జే ఎస్ డి ఎం న్యూస్) : బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. బాధితుల నుంచి లంచం తీసుకుంటూ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) నందిత రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఓ కేసు విషయమై ఆమె బాధితుడి నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ లంచం కేవలం తన కోసమే కాదని, పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికీ వాటాలు పంపిణీ చేయాల్సి ఉంటుందంటూ సదరు బాధితుడిపై ఒత్తిడి తెచ్చారు.
అయితే, లంచం ఇవ్వడం అస్సలు ఇష్టం లేని బాధితుడు ఈ విషయమై వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు వ్యూహాత్మకంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న బాధితుడు కానిస్టేబుల్ విజయ్ తో కలిసి ఎస్సై నందిత 30వేల నగదు (లంచం)తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏ సి బి డి ఎస్పీ చలసాని శ్రీధర్ ఆధ్వర్యంలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సోదాలు నిర్వహిస్తున్నారు. స్టేషన్లో అందరికీ వాటాలు ఇవ్వాలన్న ఎస్సై వ్యాఖ్యలపై కూడా అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
