బాలాజీ నగర్,మే 20,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బాలాజీ నగర్ డివిజన్ స్వాన్ లేక్ వద్ద జరుగుతున్న నాలా పనులను కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం పరిశీలించారు. ప్రధానంగా
ఐ డి ఎల్ వద్ద నిర్మాణం అవుతున్న నాల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.. పనులకు సంబంధించి నిధులు విడుదలైనా కూడా ఆలస్యం జరగడంపై అసహనం వ్యక్తం చేసారు. అలాగే స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో పార్కింగ్ వద్ద వర్షం వచ్చినప్పుడు నీరు వచ్చి చేరుతుందని. స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి వెంటనే ఈ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాలు బాబురావు, ప్రభాకర్ గౌడ్, ఎస్ ఎన్ డి పి మరియు జిహెచ్ఎంసి, ఎలక్ట్రిక్, ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు.

