ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయు వరి రకాలను సాగు చెయ్యాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. వరిలో బిపీటీ 5204, 2270, ఎన్ ఎల్ ఆర్ 33892, కె ఎన్ ఎం 1638, ఎంటీయూ 1362, 1224, 1271, రకాలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని వాటిని విత్తుకోవాలని చెప్పారు. ప్రభుత్వం కొనుగోలు చేయని రకాలు సీఆర్ -1009, ఎంటియూ – 1010, 1001 రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయదని వివరించారు.
