వర్చువల్ మహానాడుకు దర్శి టిడిపి శ్రేణులు సమాయత్తం కావాలి – తాళ్లూరు టిడిపి శ్రేణులకు పిలుపు

తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడు – 2026 విజయవంతం చేసేందుకు తాళ్లూరు మండల టిడిపి శ్రేణులు సమాయత్తం కావాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తాళ్లూరులో సోమవారం టిడిపి పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ పరిస్థితులలో నేపధ్యంలో చమురు సంక్షోభం, ఇంధన పొదుపు చర్యల నేపధ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈనెల 27,28 తేదీలలో మంగళ గిరి పార్టీ కార్యాలయం నుంచి బౌతిక, వర్చువల్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి ఆధ్వర్యంలో తాళ్లూరు మండలంలో తాళ్లూరు క్లస్టర్ ఇన్చార్జి కైపు నాగార్జున రెడ్డి, కో ఇన్చార్జి కళ్యాణ్ చక్రవర్తి, తూర్పుగంగవరం క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, కో ఇన్చార్జి పాశం నూరిబాబు ఆధ్వర్యంలో విజయవంతం చెయ్యాలని కోరారు. కార్యక్రమంంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జిలు రాచకొండ వెంకట రావు, నారిపెద్ది కళ్యాణ్, రాష్ట్ర నాటక రంగ ఆకాడమి డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, కైపు రామ కోటి రెడ్ది, సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య, గొల్లపూడి వేణుబాబు, విద్యా సాగర్, యాతం శ్రీనివాస రెడ్డి అనపర్తి నుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *