వర్షాభావ పరిస్థితులలో పంటల సాగుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు, కొత్త పాలెం గ్రామంలో సోమవారం ఆయన పర్యటించి ఖరీఫ్ సాగు విషయంలో తగిన సూచనలు చేసారు. సూపర్ ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు పడటం అస్తవ్యస్థంగా ఉంటుందని చెప్పారు. కురిసిన చోట వర్షాలు ఎక్కువగా పడటం లేదంటే అసలు పడక పోవటం జరుగుతుందని అన్నారు. తక్కువ కాల పరిమితి కల పంటలైన కంది, కొర్ర, మినుము, పెసర, ఉలవలు, ఆముదాలు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కందిలో, మినుములో, ఉలవలు, పెనరలో ఆముదాలలో సాగు చేసుకోగలిగిన రకాలను వివరించారు.
