దర్శి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎం.మురళికి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా ప్రమోషన్ పొందారు . ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. లా అండ్ ఆర్డర్ అమలులో క్రమశిక్షణ, ప్రజలతో స్నేహపూర్వక వైఖరి, కేసుల దర్యాప్తులో చురుకుదనం, క్లిష్ట పరిస్థితుల్లో డేర్ అండ్ డాష్గా వ్యవహరించే అధికారిగా మురళికి మంచి గుర్తింపు ఉంది. దర్శి పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారు.
పోలీసు శాఖలో నిజాయితీతో కూడిన సేవలు అందిస్తూ, తనకప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినందుకే ప్రభుత్వం ఈ ప్రమోషన్ ఇచ్చిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
మురళికి సీఐగా ప్రమోషన్ రావడంతో దర్శి ప్రాంత ప్రజలు, స్నేహితులు, సహచర పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
“కష్టపడి పనిచేస్తే గుర్తింపు తప్పకుండా వస్తుంది” అనే మాటను ఎం.మురళి మరోసారి నిజం చేశారు.
