సికింద్రాబాద్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా ప్యారడైజ్ నగర శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ డే (సంవిధాన్ హత్య ధివాస్ ) సందర్భంగా స్థానిక మెహబూబ్ కాలేజీలో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ 1975లో జూన్ 25న దేశంలో అప్పటి ప్రధాని గారు ఎమర్జెన్సీని ప్రకటించి దాదాపు 21 నెలలు ప్రజలను అంతా కూడా నిర్బంధంలోకి నెట్టి ప్రజాస్వామిక వాదులను, విద్యార్థి సంఘాలను సామాజిక కార్యకర్తలను ఎక్కడికి అక్కడ నిర్బంధిస్తూ నిరంకుశ పాలన కొనసాగించి ప్రజల హక్కులను కాల రాసిందని గుర్తు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ ని విధించి అది దేశ భద్రత కోసం అని మాట్లాడడం హాస్యాస్పదం. ఈ విధంగా దేశంలో దాదాపు రెండు సంవత్సరాలు ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాస్తూ ఎమర్జెన్సీ విధించడం చరిత్రలో చీకటి అధ్యాయమని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శిబా మేడం గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిద్దెల గౌతమ్ ,నగర సంఘటన కార్యదర్శి హరీష్ సాగర్ మరియు కార్యకర్తలు కౌశిక్ ,వికాస్, కార్తీక్, భరత్ తదితర విద్యార్థులు పాల్గొనడం జరిగింది…

