రాంగోపాల్‌పేట్, జూన్ 30,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని చుట్టల బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్సీ)లోసూపరింటెండెంట్గా సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన లత పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ వీడ్కోలు సభలో చీర శ్రీకాంత్ పాల్గొని ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లత తన సర్వీసులో అంకితభావం, క్రమశిక్షణ, ఎంతో పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆమె చేసిన నిస్వార్థ సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని ప్రశంసించారు. అనంతరం తోటి సిబ్బంది, స్థానికులు ఆమెకు శాలువాలు కప్పి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

