శ్రీ చైతన్య పాఠశాలలో ‘మిషన్ హరితోదయ’ కార్యక్రమం.

రాంగోపాల్‌పేట్ జులై 4
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్, ఎం.జి. రోడ్‌ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ‘స్మార్ట్ లివింగ్’ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘మిషన్ హరితోదయ’ కార్యక్రమాన్ని శనివారంనిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినరాంగోపాల్‌పేట్ డివిజన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు చీర శ్రీకాంత్ పాఠశాల ఆవరణలోవిద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో సంకల్పం, క్రమశిక్షణ, అంకితభావం అనే మూడు ముఖ్యమైన అంశాలను తూచా తప్పకుండాపాటించాలని పిలుపునిచ్చారు. మనం నాటే చిన్న మొక్కలు కాలక్రమేణా మహా వృక్షాలై సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని, అదేవిధంగా విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవిస్తూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని హితవు పలికారు. ఎంతో విలువైన విషయాలను పంచుకుంటూ విద్యార్థుల్లో ఆయన సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఈ పర్యావరణ హిత కార్యక్రమంలో మెహదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ చక్రధర్, కోఆర్డినేటర్ జనార్ధన్, పాఠశాల ప్రిన్సిపాల్ బబితా రావ్, వైస్ ప్రిన్సిపాల్ హనుమండ్ల సుహాసిని, అకాడమిక్ డీన్ కె. సురేష్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ నాయకులు డాక్టర్ శ్రవణ్ కుమార్, మదన్ పులి, కె. శ్రీధర్, ధనరాజ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటడం ద్వారా హరితోదయ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని చాటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *