తెలంగాణకు విచ్చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి అల్కా సింగ్.. – శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం

సికింద్రాబాద్, జూలై 14 (జే ఎస్ డి ఎం న్యూస్) : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, పార్లమెంట్ సభ్యురాలు,బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్‌ఐఆర్ (SIR) ఇంచార్జ్ అల్కా సింగ్ మంగళవారం రాష్ట్రానికి విచ్చేశారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని, తాజా పరిణామాలను క్షేత్రస్థాయిలో సమీక్షించే నిమిత్తం ఆమె ఈ పర్యటనకు వచ్చారు.
ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అల్కా సింగ్ ను మాజీ మంత్రి, ఎన్‌డీఎంఏ మాజీ ఉపాధ్యక్షులు,బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె రాష్ట్ర పార్టీ ప్రముఖులతో సమావేశమై ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *