సికింద్రాబాద్ జులై 14 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉజ్జయిని మహంకాళి దేవాలయ
కార్యనిర్వహణాధికారి
జీ.మనోహర్ రెడ్డి తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఉజ్జయిని మహంకాళి ట్రస్ట్ బోర్డు చైర్మన్ సురిటి కామేష్ ఆలయ కమిటీ సభ్యులు తో ఆయన సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు బోనాల ఉత్సవాలలో కీలకంగావ్యవహరించే అన్ని సంఘాలతో సమావేశమైనట్లు స్పష్టం చేశారు. ఈనెల 19 నుండిమొదలయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపుకార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి ఆషాడ బోనాల ఉత్సవ జాతరకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ఆర్థిక సహాయం అందించి బోనాలను విశ్వవ్యాప్తం చేసినట్లు తెలిపారు. గత ఏడాది జరిగిన చిన్న పాటి లోటుపాట్లను సవరించుకొని రాబోయే బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లతోపాటు వీఐపీ పాసులు మంజూరు చేసి మొత్తం 7 క్యూ లైన్ ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

