పంటల భీమా పథకాన్ని నద్వినియోగం చేసుకోవాలి -వ్యవసాయాధికారి ప్రసాద రావు

పంటల భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, కొర్రపాటి వారి పాలెంలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు నక్రమంగా లేనందున తప్పనిసరిగా పంటల భీమా చేయించుకోవాలని కోరారు. కంది పంటకు ఎకరానికి రూ.430 ప్రీమియం చెల్లించినట్లయి తే రూ.22 భీమా పొందవచ్చని, మిరప ఎకరానికి రూ. 4.500 చెల్లిస్తే రూ. 90 వేలు భీమా పొందవచ్చని అన్నారు. ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉంటుందని చెప్పారు. వరికి ఆగష్టు 15 వరకు గడువు ఉందని చెప్పారు. సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ ఉద్యాన శాఖ ద్వారా బత్తాయి, నిమ్మ తోగలకు హెక్టారుకు రూ.50వేలు గరిష్టంగా 2 హెక్టార్ల వరకు ఒక రైతుకు రాయితీ ఇవ్వబడుతుందని చెప్పారు. విఏఏ సాయి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *