ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి

ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని ఎంపీడీఓ అజిత కోరారు. వికే ఉన్నతపాఠశాలలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్త హానికరమైన శానిటరీ చెత్తలపై అవగాహన కలిగి ఉండాలని స్వచ్చతకు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎంఈఓ జి నుబ్బయ్య, హెడ్ మాస్టర్ మిల్టన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వెలుగు వారి పాలెంలో ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంద్ర కార్య క్రమాన్ని నిర్వహించారు.

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి సంబంధించిందించిన స్వచ్ఛ రథం వెలుగువారి పాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఏ ఏ) కు శనివారం వచ్చిన స్వచ్ఛ రథం సిబ్బందికి పాఠశాలలోని పాత పనికిరాని పుస్తకాలు, అట్ట పెట్టెలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఇచ్చి విద్యార్థులకు, పాఠశాలకు కావలసిన పెన్సిల్లు, ఎరైజర్లు, షార్పనర్లు, క్రేయాన్సు, చేతులు కడుక్కునే సబ్బులు తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ రథం సిబ్బంది వెంగయ్య తాళ్లూరు మండలంలోని ప్రతి ఊరు తిరుగుతూ ఉపాధి పొందుతూ పనికిరాని వస్తువులను, వ్యర్థాలను పునరుత్పాదక వస్తువులుగా మార్చటానికి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. తాళ్లూరు మండల ఎంపీడీవో గారి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛ రథం పాత పనికిరాని పుస్తకాలు , బాటిల్లు అట్టపెట్టలు తీసుకొని గృహ అవసరాలకు కావలసిన వస్తువులు, విద్యార్థులకు కావలసిన వస్తువులు, పాఠశాలలకు కావలసిన వస్తువులు ఇవ్వడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ స్వచ్ఛ రథాన్ని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *