శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో సామూహిక కుంకుమార్చన.ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కావ్య కిషన్ రెడ్డి.

బేగంపేట జులై 21,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈ రోజు సామూహిక
కుంకుమార్చనలో కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్నారు. ముందుగా శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి కావ్య కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి కావ్య కిషన్ రెడ్డితో పూజల నిర్వహింపజేసి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొని పూజలు చేశారు. ఈ కుంకుమార్చన లో సుమారు 200 వందలకు పైగా మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని వివిధ రకాలైన పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయానికి ఉదయం సాయంత్రం భక్తుల రద్దీ కొనసాగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *