బేగంపేట్, జులై 21,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ లెక్చరర్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. పద్మావతి తెలిపారు. ఇంగ్లీష్, సంస్కృతం, అరబిక్, అప్లైడ్ న్యూట్రిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిఎస్సీ హార్టికల్చర్, డిజిటల్ మార్కెటింగ్, గేమింగ్, బీకామ్, బీబీఏ, బీసీఏ, బయో టెక్నాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్ తదితర కోర్సులకు ఈ నియామకాలు చేపట్టనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో వ్యక్తిగతంగా వచ్చి దరఖాస్తులు అందజేయాలని ప్రిన్సిపల్ సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 25న ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (ID కాలేజీ) నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుందని ఆమె తెలియ జేశారు.
బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం.
21
Jul