మల్కాజ్ గిరి జు 27,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దివ్యాంగుడు అయిన రాహుల్ పోలీస్ అధికారి కావాలన్న కోరికను మల్కాజ్ గిరి సిపి బడుగుల సుమతి తీర్చారు.పుట్టుకతోనే దివ్యాంగుడైన రాహుల్‌కు పోలీస్ అధికారికావాలన్నది చిరకాల కోరిక. ఒక్కరోజైనా పోలీస్ అధికారి కుర్చీలో కూర్చోవాలన్న అతని ఆకాంక్షను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి నెరవేర్చారు.ఈ సందర్భంగా బాలుని కుటుంబ సభ్యులు సి.పి.సుమతికి కృతఙ్ఞతలు తెలియ జేశారు.
