సఫాయికార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి -భోపాల్ లో సఫాయి మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశం

నాగులుప్పలపాడు, ఆగస్టు 2, అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ పట్టణంలో మోడ్ సమాజ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా సఫాయి మజ్దూర్ ట్రేడ్ యూనియన్ జాతీయ అధ్యక్షులు చరణ్ సింగ్ టక్ హాజరై మాట్లాడారు.సఫాయి కార్మికులను ఆయా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించ కుండా వారందరి చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయితీ ,మున్సిపాలిటీ, నగరపాలక కార్పొరేషన్లు తదితర ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే సఫాయి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల పిల్లలందరికీ కార్పోరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించడంతోపాటుగా ఇంటి స్థలాలు తదితర సంక్షేమ ఫలాలు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయాలని డిమాండ్ చేశారు. జాతీయ సఫాయికరం చారి కమిషన్ ద్వారా అందజేసే ఎన్ ఎస్ కే ఎఫ్ డి సి రుణాలను కూడా నిలిపివేశారని వాటిని తిరిగి పున ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆసమస్యను తీసుకువెళ్లేందుకు ఆయా రాష్ట్రాల నుండి సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నేతలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ సబబే అని వారి వారి రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు చిన్న కులాలకు ఆర్థిక, సామాజిక, విద్య,సంక్షేమ ఫలాలు అందజేయాలని తీర్పు వెలువడినప్పటికీ అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ పలాలు అందరికీ అందటం లేదని ఆ అంశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్దాం అన్నారు.ఆంధ్రప్రదేశ్ సఫాయి మజ్దూర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గద్దె త్యాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని శ్రమకు తగ్గిన వేతనాన్ని అందించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సఫాయి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ, మున్సిపల్ నగరపాలక సంస్థల లో పనిచేసే సఫాయి కార్మికుల సమస్యలను తీసుకువెళ్తామని జాతీయ కార్యవర్గంలో ఆయన చర్చించారు. మహారాష్ట్ర రాజస్థాన్ ,పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, తదితర రాష్ట్రాలలో సఫాయి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు దీనిపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు త్వరలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని సమావేశంలో తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి. జై సింగ్ కర్త్వ,మధ్యప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జగన్ దాదాజీ, రాజేష్ కటారి,ఆంధ్రప్రదేశ్ సఫాయి మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతి అప్పారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్, పాటుగా తదితర రాష్ట్రాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జాతీయ కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *