2026- 27 పంట కాలానికి బ్యారన్ రెన్యువల్ చేస్తున్నట్లు ఒంగోలు – 2 వేలం నిర్వాహణాధికారి జె తులిసి అన్నారు. ఒంగోలు-2 బోర్డు పరధిలోని గుత్తి కొండ వారి పాలెం, కొప్పొలు, వెంగ ముక్క పాలెం గ్రామాలలో పొగాకు లో పంట నియంత్రణ పై రైతులకు అవగాహన నదస్సును నిర్వహించారు. అంతర్జాతీయంగా పొగాకు, ఉత్పిత్తి ఎక్కువగా ఉన్నందున బోర్డు అనుమతి ఇచ్చినమేర మాత్రమే పొగాకు సాగు చెయ్యాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. బ్యారల్కు రూ.50 వేలు, రైతు సంక్షేమ నిధి ఇచ్చే గ్రాంటు రూ. 1లక్ష వరకు పెంచారని చెప్పారు. నారు మడులు పెట్టే వారు బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వారు మాత్రమే నారు అమ్మాలని కోరారు. నారు కొన్న రసీదులు ఫామ్-2 ఇచ్చే సమయంలో బోర్డు వారికి అందించాలని కోరారు.
